నిజాన్ని నిర్భయంగా మాట్లాడేయడం సమంత ప్రత్యేకత. రీసెంట్గా ఓ ఇంటర్నేషనల్ ఛానల్ నిర్వహించిన వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న సామ్.. తన లైఫ్‌లో జరిగిన చాలా విషయాల గురించి ప్రస్తావించింది. ‘నా లైఫ్‌లో జరిగిన ప్రతి విషయంపై తీర్పులివ్వని వాళ్లు లేరంటే అతిశయోక్తికాదు. ‘నువ్వు అలా ఉండబట్టే.. నీకు ఇలా జరిగింది’ అంటూ.. స్టేట్మెంట్లు ఇచ్చినవారే అంతా. నిజానికి నా జీవితంలో జరిగిన విషయాలపై నా దగ్గర కూడా సమాధానం లేదు. కానీ వాటి గురించి పదే పదే మాట్లాడాల్సివస్తుంది.
నేనేం పర్ఫెక్ట్ కాదు. నేనూ తప్పులు చేశాను. ఎదురు దెబ్బలూ తిన్నాను. కానీ ఇప్పుడు మాత్రం బెటర్ అయ్యాను.’ అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఇంకా చెబుతూ ‘నేను సెక్సీగా ఉంటానని నాకే ఎప్పుడూ అనిపించలేదు. బహుశా అందుకే అనుకుంట.. నా దర్శకులు కూడా నాకు బోల్డ్ క్యారెక్టర్లు ఇవ్వలేదు. ‘పుష్ప2’ ఐటమ్ సాంగ్ రూపంలో నాకు అలాంటి అవకాశం ఒకటి వచ్చింది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకొని ఆ పాట చేశా. ఎవరూ ఊహించని విధంగా నేషనల్ లెవల్లో ఆ పాటకు గుర్తింపు వచ్చింది.’ అంటూ గుర్తు చేసుకున్నారు సమంత.