‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు తమిళ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ఖాన్‌తో భారీ పాన్ ఇండియా చిత్రానికి సిద్ధమవుతున్నారు. పునర్జన్మల నేపథ్య కథాంశంతో సాగే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 500కోట్లకుపైగా బడ్జెట్‌ను ఖర్చు పెట్టబోతున్నారట. ‘దర్శకుడు అట్లీ ఈ సినిమా కోసం ఓ సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ముఖ్యంగా పునర్జన్మలకు సంబంధించిన ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది. అందుకోసం భారీ వ్యయం అవసరమవుతుంది. సల్మాన్‌ఖాన్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో రజనీకాంత్ కీలక పాత్రను పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అట్లీ డైరెక్ట్ చేసే సినిమా పట్టాలెక్కనుంది.