అమ్మకాలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఈ దీపావళికి పసిడి…కాంతుల్ని వెదజల్లుతుందన్న ఆశాభావాన్ని ఆభరణ వ్యాపారులు వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంతో పాటు బంగారం ధర తగ్గడంతో డిమాండ్ బావుంటుందని, ఈ దీపావళికి అమ్మకాలు…కొవిడ్ ముందస్తు పండుగతో పోలిస్తే 25 శాతం వరకూ పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ చైర్మన్ అశీష్ చెప్పారు. కొవిడ్ నియంత్రణల కారణంగా 2020 దీపావళి, ధన్తేరాస్కు ఆభరణాల అమ్మకాలు అంతంతమాత్రమేనని, ఆ ఏడాది చివరి త్రైమాసికం నుంచి వృద్ధి మొదలయ్యిందన్నారు. 2019 అమ్మకాలకంటే ఈ ఏడాది 20-25 శాతం పెరగవచ్చన్నారు.