ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం శశి. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ యాక్టర్ రానా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ..నా మొదటి సినిమా నుంచి డబ్బింగ్ సెషన్ సమయంలో సాయికుమార్ తనకు స్పూర్తి అని, సాయికుమార్ డబ్బింగ్ టైంలో తనకు ఆన్లైన్ క్లాస్ గా పనిచేస్తారని చెప్పాడు రానా. శశి టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 19న మాస్కులు పెట్టుకుని థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి.
ఆది చాలా అదృష్టవంతుడు. టీజర్ ను చిరంజీవి లాంఛ్ చేశారు. ట్రైలర్ పవన్ కల్యాణ్ లాంఛింగ్ చేశారని నటుడు సందీప్ కిషన్ అన్నాడు. శ్రీనివాస నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. శశి నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాటకు మంచి స్పందన వస్తోంది. ఈవెంట్లో నాగశౌర్య, విశ్వక్సేన్, సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.