Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
Sai Durga Tej | మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకల సందడి మొదలుకానుందా? సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సాయి దుర్గా తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Sai Durga Tej | మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకల సందడి మొదలుకానుందా? సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సాయి దుర్గా తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మెగా కుటుంబం నుంచి గానీ, ఆయన వ్యక్తిగత బృందం నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీ కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 10న వివాహ వేడుక నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి అనంతరం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతర అతిథుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తేదీలు, వేడుకల వివరాలపై క్లారిటీ రావలసి ఉంది. సాయి దుర్గా తేజ్ పెళ్లి వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుంది? ఆయనకు కాబోయే భార్య ఎవరు? పెళ్లికి మెగా కుటుంబంలోని ప్రముఖులంతా హాజరవుతారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే మెగా కుటుంబం నుంచి ఈ విషయంపై స్పష్టత వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా పెళ్లి వార్త కూడా ఇటీవల అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అమెరికాలో నివసిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ సజ్జా తెలిపారు. తనకు కాబోయే భార్యకు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె అమెరికాలో పెరిగారని, వారి కుటుంబం వ్యాపార రంగంలో ఉందని వివరించారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక నిర్వహించనున్నట్లు తేజ వెల్లడించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే పెళ్లి జరగనుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Marriage
- media
- Sai Durga Tej
- sdt 19
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

