Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Raptadu | అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ కుడికాలును వైద్యులు తొలగించారు.
Raptadu | ఏపీలో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ కుడికాలును వైద్యులు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుడికాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలును తొలగించినట్టు సమాచారం.
పోలీసులు హేమంత్‌ను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వారిపై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హేమంత్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. కాళ్లలో దిగిన బుల్లెట్లను తొలగించినప్పటికీ కుడికాలి మోకాలి చిప్పలు ఛిద్రమయ్యాయని, కాలుకు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని వైద్యులు గుర్తించారు. దీంతో కుడికాలు తొలగించాల్సి వచ్చింది. మరో కాలికి కూడా తీవ్ర గాయాలయ్యాయని, దాని పరిస్థితిని అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక భద్రత మధ్య హేమంత్‌కు చికిత్స అందిస్తున్నారు.
హేమంత్పై పలు కఠిన సెక్షన్లు
రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్పై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడి సమయంలో బాధిత బాలికను కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని లక్ష్మి ఫిర్యాదుతో మరికొన్ని సెక్షన్లను జోడించినట్టు పోలీసులు తెలిపారు. హేమంత్పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎలక్ట్రిక్ రంపంతో బాలిక ముఖం, వీపు భాగాలపై దాడి చేసి గాయపరిచినందుకు సెక్షన్ 118(1) కింద కేసు పెట్టారు. పాఠశాలలోకి చొరబడి పదునైన ఆయుధంతో దాడికి పాల్పడినందుకు సెక్షన్ 333ను కూడా చేర్చారు.
ఈ ఘటనలో విద్యార్థిని గోపిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడం, గాయపడిన నిందితుడిని ఆసుపత్రిలోకి తరలించిన తీరుపై ఏపీ హైకోర్టులో ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. పోలీసుల కాల్పుల తీరుతోపాటు అనంతర పరిణామాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

