Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Russia vs Ukraine | ఐదేండ్లుగా రష్యా (Russia), ఉక్రెయిన్ (UKraine) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రెండువైపులా ఇప్పటికే భారీగా సైనిక నష్టం, ఆస్తినష్టం జరిగింది. తాజాగా ఉక్రెయిన్‌లోని మానవతా సాయం అందించే కేంద్రాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia vs Ukraine : ఐదేండ్లుగా రష్యా (Russia), ఉక్రెయిన్ (UKraine) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రెండువైపులా ఇప్పటికే భారీగా సైనిక నష్టం, ఆస్తినష్టం జరిగింది. తాజాగా ఉక్రెయిన్‌లోని మానవతా సాయం అందించే కేంద్రాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని జపోరిజియా రీజియన్ (Zaporizhzhia region) లోని ఓ గ్రామంపై ఈ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏజెన్సీ (Ukraine Emergency seriveces agnecy) వెల్లడించింది.
యుద్ధంవల్ల నిరాశ్రయులైన వారికి మానవతా సాయం పంపిణీ కోసం ఉపయోగిస్తున్న ఒక పాఠశాల భవనం, దానికి సమీపంలోని షెల్టర్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు 10 గైడెడ్ బాంబులతో విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. రష్యాకు ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశం లేదనడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు 212 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐరోపాలో అతిపెద్ద చమురు సరఫరా కేంద్రాల్లో ఒకటైన సమారా ప్రాంతం లక్ష్యంగా చేసిన ఉక్రెయిన్ డ్రోన్ల దాడిని తమ గగనతల రక్షణవ్యవస్థ తిప్పికొట్టిందని తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్, రష్యాల్లోని ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్ట్ యాప్‌లు సైబర్ దాడులకు గురయ్యాయి. ఇరుదేశాల్లో ప్రజలకు అణు ముప్పు, రేడియేషన్, రసాయన దాడులు పొంచి ఉన్నాయంటూ సైబర్ నేరస్థులు నకిలీ సందేశాలు పంపించి పౌరులను ఆందోళనకు గురిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

