లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ సందర్భంగా జాన్సన్ ఉద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను విజయవంతం కానందుకు చింతిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగాన్ని వదులుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు. కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడు అవసరం అని వ్యాఖ్యానించిన జాన్సన్.. కొత్త ప్రధాని కూడా అవసరమని చెప్పారు. కొత్త నాయకుడికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇక ఉక్రెయిన్‌కు తమ మద్దుతు ఇస్తూనే ఉంటామని బోరిస్ పేర్కొన్నారు.