క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5 న నిర్వహించారు. సరిగ్గా 39 సంవత్సరాల 1 నెల, 19 రోజుల తరువాత అంటే 2010 ఫిబ్రవరి 24 న.. క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. ఈ ఘనతను సచిన్ టెండూల్కర్ సాధించి క్రికెట్ చరిత్రలో అపురూప ఘట్టానికి తెరలేపారు. గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్సింగ్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ తన పేరిట కొత్త చరిత్రను లిఖించుకున్నారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
సచిన్‌తో సెహ్వాగ్ క్రీజుకు చేరుకున్నారు. కేవలం 25 పరుగుల స్కోరులోనే తొలి వికెట్ పడిపోయింది. కేవలం 9 పరుగులు చేసిన సెహ్వాగ్‌ను వేల్ పార్నెల్ ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన దినేష్ కార్తీక్, యూసుఫ్ పఠాన్‌తో ముఖ్యమైన భాగస్వామ్యాలను పంచుకోవడంతో జట్టు స్కోరు 300 కు చేరింది. 50 వ ఓవర్ మూడో బంతికి ఒక పరుగు చేసిన సచిన్.. క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. సచిన్ 147 బంతులను ఎదుర్కొని 25 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఈ ఫీట్ సాధించాడు. దాంతో 13 ఏండ్ల క్రితం పాకిస్తాన్‌కు చెందిన సయీద్ అన్వర్ చేసిన అత్యధిక స్కోరు 194 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
200 పరుగులు చేసిన అత్యధిక స్కోరు రికార్డు సచిన్ పేరిట ఒక ఏడాది 9 నెలలు 14 రోజులు మాత్రమే ఉన్నది. 2011 డిసెంబర్ 8 న, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో వీరేందర్ సెహ్వాగ్ 209 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దీంతో డబుల్ సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సెహ్వాగ్ రికార్డులకెక్కాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మరో ప్రత్యేకత ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 153 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.
2020: 70 మందిపై లైంగికదాడి కేసులో దోషిగా తేలిన నిర్మాత హార్వీ విన్‌స్టెయిన్
2008: క్యూబా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఫిడేల్ కాస్ట్రో
1998: హిందీ నటి లలితా పవార్ కన్నుమూత
1991: గల్ఫ్ యుద్ధంలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన అమెరికా ఆర్మీ
1981: బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్-లేడీ డయానా వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన బకింగ్‌హామ్ ప్యాలెస్
1976: క్యూబాలో అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం
1967: హైదరాబాద్ యొక్క ఏడవ, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణం
1955: ఆపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలో జననం
1948: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి కుమారి జయలలిత జననం
1942: జర్మన్లో మొదటి వాయిస్ ఆఫ్ అమెరికా ప్రసారం
1868: అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌పై అభిశంసన
1739: ఇరాన్ ఆక్రమణదారు నాదిర్ షా, మొఘల్ పాలకుడు మొహమ్మద్ షా మధ్య కర్నాల్ యుద్ధం
#ThisDay in 2010 the great @sachin_rt became the first batsman to score a double ton in ODI cricket.
— BCCI (@BCCI) February 24, 2018
He faced 147 balls and scored the first double century with 25 fours and 3 sixes against South Africa at Gwalior #Legend. pic.twitter.com/cwb0TRA9TT