IND vs AUS : భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(59 : 64 బంతుల్లో 9 ఫోర్లు) వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆడం జంపా ఓవర్లో రెండు పరుగులు తీసి గైక్వాడ్ ఫిఫ్టీ మార్క్ దాటాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(59) కూడా ధాటిగా ఆడుతున్నాడు. దాంతో, భారత్ 18 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 120 రన్స్ చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 155 పరుగులు కావాలి.
Ruturaj Gaikwad joins the party with a fine half-century.
Brings up his maiden ODI FIFTY.
Live – https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/58D1HTsNh7
— BCCI (@BCCI) September 22, 2023
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి.