ముంబై, మార్చి 25 : వరుగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన రూపాయి మళ్లీ తిరోగమనబాట పట్టింది. ఫారెక్స్ మార్కెట్లో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పతనం చెంది 85.72 వద్దకు పడిపోయింది. దిగుమతిదారులు డాలర్‌ను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపడం, ఇతర కరెన్సీలు బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి కారణమని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 85.59 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 85.58 గరిష్ఠ స్థాయిని తాకింది.