Actress Ramya | కన్నడ స్టార్ హీరోయిన్ రమ్య మృతి చెందిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుండెపోటుతో ఆమె మరణించిందని సోషల్ మీడియాలో పలువురు ‘RIP’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని, అవన్ని ఫేక్ న్యూస్లని కుటుంబ సభ్యులు ఖండించారు. రమ్య క్షేమంగానే ఉందని ఆమె స్నేహితురాలు ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ‘రమ్యతో ఇప్పడే మాట్లాడాను. ప్రస్తుతం ఆమె జెనీవాలో ఉంది. గురువారం బెంగళూరు రానున్నారు’ అని ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రమణ్యం ట్వీట్ చేసింది. మరో ట్విట్లో ‘జెంటిల్ ఉమెన్‌తో వండర్ఫుల్ మీటింగ్ జరిగింది. జెనీవాలో డిన్నర్ చేశాం. బెంగుళూరు గురించి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకొన్నాం’ అని చిత్ర సుబ్రమణ్యం వెల్లడిస్తూ ఆమె ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
రమ్య మరణ వార్త తెలియగానే కన్నడ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఇక అదంతా పుకారని తేలడంతో ఊపిరి పీల్చుకుంది. పేరుకు రమ్య కన్నడ నటినే అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరచితమే. తెలుగులో రమ్య, కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘అభిమన్యు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. అయితే ఆమె నటించిన పలు తమిళ సినిమాలు డబ్బింగ్ రూపంలో రిలీజయి ఇక్కడ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో ప్రియ పాత్రలో అందరి మనసులు దోచుకుంది.
రెండు దశాబ్దాల కిందట పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘అభి’ సినిమాతో రమ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రమ్య. తొలి సినిమాతోనే తమిళనాట తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉపేంద్ర, సుదీప్ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. ఇక తమిళంలోనూ రమ్య.. ధనుష్, సూర్య, జీవా వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రెండు దశాబ్దాల కాలంలో రమ్య 40 సినిమాలకు పైగా చేసింది. మొన్న రిలీజైన ‘బాయ్స్ హాస్టల్’ సినిమా కన్నడ వెర్షన్లోనూ రమ్య నటిచింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఉత్తరఖాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Wonderful meeting the very talented and genteel lady @divyaspandana for dinner in Geneva. We talked about many things including our love for Bangalore. 💫 pic.twitter.com/1kN5ybEHcD
— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023
I just spoke to @divyaspandana She’s well. En route to Prague tomorrow and the to Bangalore.
— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023