RTC Bus | తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది బుధవారం నుంచి సమ్మె సరైన్ మోగించిన విషయం తెలిసిందే. కార్మికుల రెండో రోజు సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్ డ్రైవర్లతో సేవలందించే ప్రయత్నం చేస్తోంది. అయితే సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కరీంనగర్లో ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తాజాగా బర్కత్ పుర బస్ డిపోలో ప్రైవేట్ డ్రైవర్లు నడపడం వల్ల బస్సులు డ్యామేజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను ఎలా డ్యామేజ్ చేస్తున్నారో తెలిపే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆర్టీసీ బస్సులను అడ్డగోలుగా నడిపి డ్యామేజ్ చేస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు
బర్కత్ పుర బస్ డిపోలో తాము నడిపే బస్సులను ప్రైవేట్ డ్రైవర్లు డ్యామేజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు https://t.co/vMl6K9ARxN pic.twitter.com/ebI9TxU6pk
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026