ఇదేనా క్రీడలకు ప్రోత్సాహం?
తెలంగాణ వేదికగా జరుగనున్న ఖేలో ఇండియా క్రీడాపోటీల జాబితా నుంచి కయాకింగ్, కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌ను తొలగించాలనుకోవడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ఖేలో ఇండియా నుంచి కయాకింగ్, కెనోయింగ్ తొలగించాలనుకోవడం దుర్మార్గం
- ప్రభుత్వంపై ఆర్ఎస్పీ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వేదికగా జరుగనున్న ఖేలో ఇండియా క్రీడాపోటీల జాబితా నుంచి కయాకింగ్, కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌ను తొలగించాలనుకోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ భవిష్యత్తు అంధకారమవుతున్నదని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన పేరొన్నారు.
సొంత రాష్ట్రంలో జరుగుతున్న పోటీల్లో భాగస్వామ్యం లేకుండా చేయడం అణగారినవర్గాల ప్రతిభను ఉద్దేశపూర్వకంగా తొకిపెట్టడమేనని మండిపడ్డారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని భారీ ప్రకటనలు చేస్తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడాకారుల అవకాశాలను కాలరాయడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు.
కయాకింగ్, కెనోయింగ్ ఒలింపిక్ స్థాయి క్రీడలని, గతంలో కాశ్మీర్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లోనూ వీటికి చోటు కల్పించారని గుర్తుచేశారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన క్రీడలను, అవార్డులు సాధించిన గిరిజన బిడ్డలున్న విభాగాలను పకన పెట్టడం సామాజిక వివక్ష కాక మరేమిటని సూటిగా ప్రశ్నించారు. తక్షణమే కయాకింగ్, కెనోయింగ్ క్రీడలను ఖేలో ఇండియా ఈవెంట్ల జాబితాలో చేర్చి, తమ ప్రతిభను చాటుకునేందుకు గిరిజన విద్యార్థులకు పూర్తి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

