17 మంది దుర్మరణం
కోల్‌కతా దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తర కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. సప్తమిని పురస్కరించుకుని దుర్గామాతకు పూజలు ఆచరించడానికి పెద్దయెత్తున భక్తులు రావడంతో ఒక పక్క వర్షం పడుతుండగా జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటుచేసుకుంది. శారదా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.
- కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం
- దుర్గా మండపంలో తొక్కిసలాట
కోల్‌కతా, అక్టోబర్ 17: కోల్‌కతా దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తర కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. సప్తమిని పురస్కరించుకుని దుర్గామాతకు పూజలు ఆచరించడానికి పెద్దయెత్తున భక్తులు రావడంతో ఒక పక్క వర్షం పడుతుండగా జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటుచేసుకుంది. శారదా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.
ఒక పక్క వర్షం పడుతున్నా భక్తులు పెద్దయెత్తున రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను కోల్‌కతా మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ, ఫైర్ బ్రిగేడ్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మండప నిర్వాహకులు కూడా బాధితులకు సహాయం అందించారు. ఘటనా స్థలి అంతా అంబులెన్స్‌ల సైరన్లు, బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో నిండిపోయింది.
పెద్దయెత్తున తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురు స్పృహతప్పి పడిపోయారని, దీంతో బాధితుల బంధువులు వారిని బైక్‌లపై దవాఖానలకు తీసుకుని పోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు రెండూ ఇరుకుగా ఉన్నాయని, సరైన లైటింగ్ లేదని, ఈ ఘటనలో తన కుమార్తె, మనవరాలు గాయపడ్డారని మరో బాధితుడు తెలిపారు. బాధితులకు సమాచారం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక ఉచిత హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన తర్వాత మండప నిర్వాహకులు ప్రవేశాన్ని నిలిపివేసి లైట్లను ఆర్పివేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని మండప పూజా నిర్వాహకులు బికాస్ దాస్ తెలిపారు. శనివారం రాత్రి 7.40 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రూ.2లక్షల పరిహారం
కోల్‌కతా తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు పరిహారంగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

