కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 27 : కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నంబర్‌కు వేలం వేయగా.. ఎంఎస్ఎస్ఎస్ ఇన్ఫ్రాటెక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్టు ఎంవీఐ శ్రీనుబాబు తెలిపారు. టీజీ 08కే 9999 నంబర్‌కు బేసిక్ ధర రూ.50 వేలు నిర్ణయించగా.. సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఎంఎస్ఎస్ఎస్ ఇన్ఫ్రాటెక్ రూ.9,99,999 బిడ్‌ను దాఖలు చేసి నంబర్‌ను కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఇది కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయ చరిత్రలోనే అత్యధిక ధర అని తెలిపారు.