కొల్లాపూర్, మార్చి 23 : ప్రాజెక్టు పనుల్లో భూము లు కోల్పోయిన రైతులకు సర్కార్ పరిహారం జమ చే యడంతో సంతోషంలో మునిగిపోయారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 87.14 ఎకరాల భూములు కోల్పోయిన కొల్లాపూర్ మండలం కుడికిళ్ల, ఎల్లూరు గ్రామాలకు చెందిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. మొత్తం 123 మందికిగానూ రూ.9,61,04, 389 పరిహారాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కుడికిళ్లకు చెందిన 35 మంది రైతులకు (50 ఎకరాలు) రూ.6,77,55,978, ఎల్లూరు రైతు లు 23 మందికిగానూ (37.14 ఎకరాలు) రూ.2, 83,48,411 పరిహారం అందింది. దీంతో భూ నిర్వాసితుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. బుధవా రం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రపటాలకు వారు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప లువురు నిర్వాసితులు మాట్లాడుతూ గతంలో తోటి రైతులకు ఎకరాకూ రూ.5.50 లక్షలు కంటితుడుపుగా పరిహారం ఇస్తే తీసుకోలేదని గుర్తు చేశారు. మా కు టుంబ పరిస్థితులను కళ్లారా చూసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీంతో ఎకరాకూ రూ.15 లక్షలపైగా అందడం సంతృప్తికరంగా ఉన్నదని పలువురు సంతోషంలో మునిగిపోయారు. తమకు న్యా యం చేసిన ఎమ్మెల్యే బీరానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు అప్పగించిన తమ కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద పునరావాసం కల్పించి ఆదుకోవాలని రెండు గ్రామాల రైతులు కోరారు. కార్యక్రమంలో కుడికిళ్ల ఎంపీటీసీ బుచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రావు, లక్ష్మారావు, గురువయ్య, బంగారయ్య, సన్నయ్య, చిన్నకుర్మయ్య, రాజు, నిరంజన్, ఈశ్వరయ్య, చెన్నరాములు ఉన్నారు.