లక్నో: లక్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే(Uttar Pradesh Expressway)ను ఇటీవలే ప్రారంభించారు. ఆ హైవేను ప్రారంభించి కేవలం 14 రోజులు మాత్రమే అవుతోంది. అయితే ఆ జాతీయ హైవేపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 4200 కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. జూలై 13వ తేదీనే దాన్ని ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ హైవేపై పగుళ్లు రావడంతో.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. కాస్త వర్షానికే రోడ్డులో పగుళ్లు వచ్చినట్లు ఆరోపించారు.
రెండు వారాల క్రితమే ప్రారంభమైన హైవేలో ఎలా క్రాక్స్ వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నకుల్ ప్రకాశ్ వర్మ స్పందిస్తూ.. రోడ్డుపై కోటింగ్ స్లిప్ అయ్యిందని, ఆదివారం సాయంత్రం 5 గంటల లోపే ఆ ప్రాంతానికి రిపేర్ చేసినట్లు తెలిపారు. చాలా దూరం ఉండే రోడ్లపై సాధారణంగా టెక్నికల్ కారణాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలపై దర్యాప్తు అవసరం లేదన్నారు. రొటీన్‌గా జరిగే టెక్నికల్ సమస్యను వెంటనే పరిష్కరించినట్లు ఆయన చెప్పారు.
ఉన్నావ్ సమీపంలోని కొరారి ఏరియాలో రోడ్డు ధ్వంసమైన వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది.
ये सड़क 4,200 करोड़ रुपए में बनी है. सिर्फ 14 दिन पहले इसका उद्घाटन हुआ था.
लखनऊ-कानपुर एक्सप्रेसवे pic.twitter.com/mre6gOQm5U
— Ranvijay Singh (@ranvijaylive) July 26, 2026