– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నీలగిరి, ఏప్రిల్ 28 : నల్లగొండ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, ప్రతి డివిజన్ మౌలిక సదుపాయల కల్పనకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని నల్లగొండ కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ కార్పోరేషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి అ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వేసవి కాలం ప్రారంభమై ఎండలు ముదిరినందున ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు సమస్య రాకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కార్పోరేటర్లను కోరారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
15వ డివిజన్ కార్పోరేటర్, బీఆర్ఎస్ నాయకుడు దొడ్డి రమేశ్ మాట్లాడుతూ.. చీలిన గ్రామాలు, శివారు ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అభివృద్ధి చెందిన డివిజన్లకు సమానంగా వీలిన గ్రామాల్లో నిధులు కేటాయించడం వల్ల అభివృద్ధిలో పోటీ పడలేవని ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. 24వ కార్పొరేటర్ గోపగాని స్వాతీరాజశేఖర్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్‌ను ఇష్టానుసారంగా చేయడంతో ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో కూడా పబ్లిక్, సెమి పబ్లిక్ జోన్లుగా కేటాయించడం వల్ల వారు వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా 485, 488 సర్వే నంబర్లను వాటి నుండి తొలగించాలన్నారు.
ఈ సమావేశంలో కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, కార్పోరేటర్లు మారగోని భవానీ గణేష్, కుందురు దీపికా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పెరిక యాదయ్య, పేర్ల మల్లేశ్వరి ఆశోక్, రత్నపురం తారకమ్మ శ్రీనివాస్, బణావత్ దీప్లానాయక్, మహ్మద్ ఇబ్రహీం, మారగోని నవీన్ గౌడ్, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, రామగిరి అఖిల్, దాసరి సాయికుమార్, రఫియోద్దీన్, అల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి కృష్ణంరాజు, అలకుంట్ల ఝాన్సీ నాగరత్నంరాజు, అదికారులు పాల్గొన్నారు.

‘మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి డివిజన్‌కు రూ.10 లక్షలు’