Telangana Economy : తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు శరవేగంగా జరిగిన అభివృద్ధి ఇప్పుడు కుంటుపడింది. నాడు మార్కెట్లో నగదు చెలామణి పెద్ద ఎత్తున జరిగి రాష్ట్ర సర్క్యులర్ ఎకానమీ బలపడింది. కానీ ఇప్పుడు నగదు చెలామణి తగ్గిపోయి సర్క్యులర్ ఎకానమీ బలహీనపడుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వృద్ధి వేగంగా జరగడానికి కారణం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి నమూనా కారణమైతే.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధి కుంటుపడటానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ తలాతోక లేని విధానాలు అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4.51 లక్షల కోట్లుగా ఉండేది. ఆ తర్వాత పదేళ్లలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి అది రూ.14.63 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మూడింతలు పెరిగింది.
అదేవిధంగా రాష్ట్ర తలసరి ఆదాయం కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేల కోట్లుగా ఉండేది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి అది రూ.3.47 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఆషామాషీగా జరిగిన అభివృద్ధి కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పదేళ్లలో పాలనలో అమలు చేసిన అభివృద్ధి నమూనా ఫలితం. కేసీఆర్ ఆసరా పెన్షన్లు, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాల ద్వారా మార్కెట్లో నగదు చెలామణి పెంచి సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభవృద్ధి కుంటుపడుతూ వస్తోంది. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలతో మార్కెట్లో నగదు చెలామణి తగ్గింది. రైతుబంధును సక్రమంగా అమలు చేయడం లేదు. ఇక చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ లాంటివి పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా మార్కెట్లో నగదు చెలామణి తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయంది. దాంతో సర్క్యులర్ ఎకానమీ బలహీనంగా మారి అభవృద్ధి కుంటుపడిపోయింది.
ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.51.41 వేల కోట్లు కాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అది రూ.1.69 లక్షల 293 కోట్లకు చేరింది. అంటే రాష్ట్ర ఆదాయం ఏడాకి సగటున 23 శాతం పెరిగింది. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో రాష్ట్ర రాబడి పెరగపోగా రూ.1489 కోట్లు తగ్గిపోయి రూ.1.67 లక్షల 804 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ (రాష్ట్ర సొంత పన్నుల రాబడి-SOTR) 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.29.288 వేల కోట్లు ఉండగా.. 2023-24 నాటికి SOTR రూ.1.11 లక్షల 798 కోట్లకు పెరిగింది. అంటే ఘననీయంగా 31.3 శాతం వృద్ధి నమోదైంది. కానీ కాంగ్రెస్ హయాంలో 2024-25 ఆర్థిక సంత్సరంలో SOTR రూ.1.09 లక్షల 233 కోట్లకు పడిపోయింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2,565 కోట్లు తగ్గిపోయింది.
అంటే బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య నక్కు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందన్నమాట. ఈ క్రమంలో నాడు తెలంగాణ ఆర్థిక వృద్ధికి తోడ్పడిన కేసీఆర్ అభివృద్ధి నమూనా గురించి, ఇప్పుడు రాష్ట్ర ప్రగతి కుంటుపడటానికి కారణమవుతున్న కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాల గురించి నమస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేక కథనం ద్వారా సమగ్రంగా తెలుసుకుందాం..