Uber Cup : ఎన్నో ఆశలతో డెన్మార్క్‌కు వెళ్లిన భారత బృందం ఉబెర్ కప్(Uber Cup) నుంచి నిష్క్రమించింది. ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu) ఓటమితో టీమిండియా అనూహ్యంగా ఇంటిదారి పట్టింది. గ్రూప్ ఏ మ్యాచ్‌లో చైనా షట్లర్ వాంగ్ ఝియూ ధాటికి సింధు చేతులెత్తేసింది. డబుల్స్‌లో ప్రియా కొంజెంగ్‌బమ్ – శృతి మిశ్రా ద్వయాన్ని చైనా జంట లీ షెంగ్ షూ – టాన్ నింగ్ చిత్తు చేసింది. ఇషారాణి బరౌహ్, దేవికా సిహగ్ ఓటమితో భారత జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది.
మహిళా షట్లర్ల వైఫల్యంతో ఉబెర్ కప్ నుంచి ఇంటిదారి పట్టింది. తొలుత సింగిల్స్‌లో పీవీ సింధు పోరాడినా చైనా గోడను దాటలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలో 4-7తో వాంగ్ ఝియూ జోరుతో వెనకబడిన సింధు దూకుడుగా ఆడి 9-9తో స్కోర్ సమం చేసిం నెట్ వద్ద బలమైన షాట్లు ఆడుతూ.. వరసగా ఐదు పాయింట్ గెలిచి 11-9తో పైచేయి సాధించింది.
Tough day on the court, but the fight remains. 🇮🇳
Huge respect to Team India for pushing through every set against the world’s best. We learn, we grow, and we come back stronger! 🏸🔥
📸 @badmintonphoto pic.twitter.com/kjdY5oi0hI
— BAI Media (@BAI_Media) April 27, 2026
కానీ, స్కోర్లు 16-16 ఉన్నప్పడు తెలివిగా ఆడిన చైనా షట్లర్ 21-16తో సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్లో పుంజుకున్న సింధు ప్రత్యర్ధికి అవకాశమివ్వకుండా 21-19తో విజయం సాధించింది. కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో వాంగ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. చివరకు 19-21తో భారత స్టార్ వెనకబడింది.
అసలే సింధు ఓటమితో డీలా పడిన భారత్‌ను డబుల్స్‌లో ప్రియా కొంజెంగ్‌బమ్ – శృతి మిశ్రా ద్వయం, సింగిల్స్‌లో ఇషారాణి బరౌహ్ పరాజయం నిష్క్రమణకు దారి తీసింది. తనీషా క్రాస్టో – కవిప్రియ సెల్వం సైతం కంగుతిన్నారు. వీరిని ఝాంగ్ షుక్జిన్, లుయో గ్జుమిన్ జంట 21-10, 21-19, 19-21తో మట్టికరిపించింది. దేవికా సిహగ్ను గ్జు వెన్జింగ్ ఓడించడంతో ఉబెర్ కప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది.