RRR Records | కొన్ని చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ హవా ఇంకా కొనసాగుతుంది. జక్కన్న రాజమౌళి చెక్కిన ఈ దృశ్య కావ్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికి ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. చిత్రం విడుదలై నలభై రోజుల దాటినా కొన్ని చోట్ల మంచి వసూళ్ళే వస్తున్నాయి. చరణ్, తారక్‌ల నటనకు సినీప్రముఖులు సైతం జైజైలు కొట్టారు. ఇండియాలో వరుసగా రెండు సార్లు 1000కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. నైజాంలో 100కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఒక్కటేమిటి చెప్పుకుంటే పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ చిత్రం బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డును తనపేరిట లిఖించుకుంది.
ఆర్టీసి క్రాస్ రోడ్లో ట్రిపుల్ఆర్ అరుదైన ఘనతను సాధించింది. తాజాగా ఈ చిత్రం 5కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. వరుసగా 4, 5 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో వరుసగా బాహుబలి-2(3.76కోట్లు), రంగస్థలం(2.41కోట్లు) ఉన్నాయి . ఈ చిత్రంతో ప్రభాస్ తరువాత తారక్, చరణ్‌లు 1000కోట్ల క్లబ్లో నిలిచిన హీరోలుగా నిలిచారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు.