న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. పొట్టి ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే వెనుదిరిగిన టీమ్ఇండియా వారం రోజుల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దీనికోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తాజా ఐపీఎల్ హీరోలు రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌తో పాటు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లు బుమ్రా, షమీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు టెస్టు ఫార్మాట్లో ఇరగదీస్తున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను పరిమిత ఓవర్ల కోసం ఎంపిక చేశారు. మెగాటోర్నీలో కేవలం బ్యాటర్‌గానే సేవలందించిన హార్దిక్ పాండ్యాను విస్మరించిన సెలెక్టర్లు అతడి స్థానంలో వెంకటేశ్‌కు అవకాశం కల్పించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి.. లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చాన్స్ ఇచ్చారు. ప్రపంచకప్‌లో రిజర్వ్ ఆటగాళ్లుగా కొనసాగిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌కు జట్టులో చోటు దక్కింది.
భారత జట్టు:
రోహిత్ (కెప్టెన్), రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, ఇషాన్, వెంకటేశ్ అయ్యర్, చాహల్, అశ్విన్, అక్షర్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.