మంచిర్యాల ఏసీసీ/ఫర్టిలైజర్‌సిటీ, ఫిబ్రవరి 1: పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 10 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 వైద్య కళాశాలలు, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 14 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారని చెప్పారు. మంగళవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మంచిర్యాల వైద్య కళాశాల మ్యాప్‌ను విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి పరిశీలించారు. అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ సంగీతా సత్యనారాయణతో కలిసి పర్యవేక్షించారు.