కొండాపూర్, జనవరి 9 : హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే(Cyber Gateway) ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుతం ఏర్పడడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యాయి. అయితే.. వెంటనే అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన చోట భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులను అలర్ట్ చేస్తూ పక్కనుంచి వెళ్లాలని చెబుతున్నారు.
సైబర్ గేట్‌వే రోడ్డుపై కుంగుబాటు కారణంగా భారీ గుంత ఏర్పడడంతో వాహనదారులు కంగుతిన్నారు. వందలాదిమంది రాకపోకలు సాగించే రోడ్డు కావడంతో అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన ప్రాంతానికి అడ్డుగా భారీకేడ్లు పెట్టి ప్రమాదాలు జరగకుండా చూశారు. వాహనదారులకు పక్క నుంచి వెళ్లాలని సూచిస్తూ ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అదృష్టవశాత్తూ రోడ్డు కొద్దిగా కిందకు కుంగిన వెంటనే అప్రమత్తవడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.