Road accident : స్కూల్ బస్సు (School bus) అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు (Students) దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కొలంబియా (Colombia) నైరుతి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
విద్యార్థులు కొలంబియా తీరంలోని కరేబియన్ బీచ్‌లో తమ గ్రాడ్యుయేషన్‌ను సెలబ్రేట్ చేసుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. యాంటియోక్వియా గవర్నర్ ఆండ్రెస్ జులియన్ రెండాన్ ఈ ప్రమాదంపై స్పందించారు. బస్సు కరేబియన్ బీచ్ నుంచి మెడిల్లిన్కు వస్తుండగా ప్రమాదానికి గురైందని చెప్పారు.
ఒక్కసారిగా బస్సు 40 అడుగుల లోతైన లోయలోకి జారిపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందని రెండాన్ అన్నారు. మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని చెప్పారు. క్షతగాత్రులను మెడిల్లిన్ లీగల్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్కు తరలించినట్లు తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.