e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Ritu Varma | పెళ్లికి తొందరేం లేదు!

Ritu Varma | పెళ్లికి తొందరేం లేదు!

‘పాత్రల పరంగా సవాళ్లను ఇష్టపడతా. ఛాలెంజెస్‌ ఉన్నప్పుడే అత్యుత్తమ నటనను కనబరచగలమని విశ్వసిస్తా’ అని చెప్పింది. రీతూవర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రీతూవర్మ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ సంగతులివి.

సినిమాల వేగాన్ని పెంచినట్లున్నారు? వరుసగా మీరు నటించిన సినిమాలు విడుదలకానుండటం ఎలా అనిపిస్తున్నది?
‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్‌ జగదీష్‌’ తర్వాత ఈ ఏడాది విడుదలవుతున్న నా మూడో సినిమా ఇది. తొలి రెండూ ఓటీటీలో విడుదలకాగా ఈ సినిమా మాత్రం థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. కథతో పాటు నా క్యారెక్టరైజేషన్‌ నచ్చి ఈ చిత్రాన్ని అంగీకరించా.

- Advertisement -

సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో భూమి అనే ఆధునిక అమ్మాయిగా నేను కనిపిస్తా. భిన్న పార్శాలు, వేరియేషన్స్‌తో నవ్యరీతిలో నా క్యారెక్టర్‌ సాగుతుంది. పరిపూర్ణ నటిగా నాకు గుర్తింపును తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. సినిమా కథ నా పాత్ర దృక్కోణం నుంచి సాగుతుంది కానీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా మాత్రం కాదు. బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీగా దర్శకురాలు లక్ష్మీసౌజన్య సినిమాను తెరకెక్కించింది. రెగ్యులర్‌ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా ఉంటుంది. కౌగిలింతలు, ముద్దులు ఉండవు. నాయకానాయికలు ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తపరిచే విధానం కొత్తగా ఉంటుంది.

మీ రియల్‌లైఫ్‌కు ఈ క్యారెక్టర్‌ ఎంతవరకు దగ్గరగా ఉంటుంది?
నేటితరం యువత మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ నా నిజజీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు ఎక్కువగా చేశాను. ప్రతి పాత్రలో నన్ను నేను చూసుకుంటా. భూమి పాత్ర తాలూకు కొన్ని లక్షణాలు నా రియల్‌లైఫ్‌లో కనిపిస్తాయి.

నాగశౌర్యతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?అతడితో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?
ప్రేమకథలు వర్కవుట్‌ కావాలంటే నాయకానాయికల కెమిస్ట్రీ బాగుండటం చాలా ముఖ్యం. ఈ సినిమాలో నాగశౌర్యతో నా జోడీ బాగుందని అందరు ప్రశంసిస్తున్నారు. అక్కడే మేము యాభై శాతం విజయాన్ని అందుకున్నామనిపించింది. నాగశౌర్య క్రమశిక్షణకు ఎక్కువ విలువనిస్తారు.

మీ గత చిత్రాలకు భిన్నంగా ఇందులో ఓ మాస్‌ గీతంలో నటించారు?
‘దిగు దిగు నాగ’ పాటను పూర్తిచేయడానికి చాలా కష్టపడ్డా. నా శైలికి పూర్తి భిన్నమైన పాట ఇది. ఈ తరహా పాటలో నటించడం ఇదే తొలిసారి. రిహార్సల్స్‌, షూటింగ్‌ సమయంలో చాలా భయపడ్డా. చేయగలనా?లేదా అనే సందేహాలొచ్చాయి. పాటకు వస్తున్న స్పందనతో నా కష్టం మొత్తం ఫలించిన భావన కలుగుతున్నది. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు.

పెళ్లి విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?ఎలాంటి వరుడు కావాలని అనుకుంటున్నారు.
పెళ్లికి తొందరేం లేదు. రెండు, మూడేళ్ల తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తా. పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యులెవరూ నన్ను ఒత్తిడి చేయడం లేదు. వారు నా అభిప్రాయాల్ని గౌరవిస్తారు. పెళ్లి విషయంలో నాతో జోక్స్‌ చేస్తుంటారు. కానీ మా మధ్య సీరియస్‌ డిస్కషన్‌ ఎప్పుడూ రాలేదు.

సినిమాల పరంగా డ్రీమ్‌రోల్స్‌ ఉన్నాయా?తదుపరి సినిమా విశేషాలేమిటి?
కెరీర్‌ ముగిసేలోపు ఒక్క పీరియాడిక్‌ సినిమానైనా చేయాలన్నది నా కల. ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నా. తమిళంలో అశోక్‌ సెల్వన్‌తో రోడ్‌జర్నీ నేపథ్య చిత్రాన్ని అంగీకరించా. మంచి కథ దొరికితే వెబ్‌సిరీస్‌లలో నటిస్తా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement