రిషబ్ పంత్‌కు జరిమానా.. కోచ్ ఆమ్రేపై మ్యాచ్ నిషేధం
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్‌గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ అనుచితంగా ప్రవర్తించారు. చివరి ఓవర్లో మూడవ బంతిని నోబాల్‌గా ప్రకటించాలని పంత్ అసహనం వ్యక్తం చేస్తూ బ్యాటర్లను వెనక్కి రావాలని సంకేతాలిచ్చాడు. ఆ ఘటనలో ఇవాళ ఐపీఎల్ నిర్ణయం తీసుకున్నది. నియమావళి ఉల్లంఘన కింద రిషబ్ పంత్‌కు వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. అయితే పంత్ ఆటను అడ్డుకున్న సమయంలో అతనికి వంతపాడిన శార్దూల్ ఠాకూర్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఇక అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు .. ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వెళ్లి అంపైర్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ కోడ్‌లోని ఆర్టికల్ 2.7 ప్రకారం తప్పును అంగీకరిస్తున్నట్లు పంత్ తెలిపాడు. 2.8 కోడ్ నియమావళి ప్రకారం తప్పు జరిగినట్లు శార్దూల్ అంగీకరించాడు. ఐపీఎల్ వేసిన జరిమానాను ఇద్దరూ అంగీకరించారు. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు మ్యాచ్ బ్యాన్‌తో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజును ఫైన్‌గా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

