Rinku Singh: స్పోర్ట్స్ ఆఫీసర్‌గా రింకూ సింగ్ నియామకం.. యూపీ సర్కార్ 3 కోట్ల ఆర్థిక సాయం
Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్.. రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమితుడయ్యారు. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు యూపీ సర్కార్ ఆ జాబ్ ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు క్రికెటర్ రింకూ ధన్యవాదాలు తెలిపారు.
లక్నో: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Rinku Singh).. రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమితుడయ్యారు. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు యూపీ సర్కార్ ఆ జాబ్ ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు క్రికెటర్ రింకూ ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని రింకూ షేర్ చేశారు. యూపీ సర్కారు తనకు 3 కోట్ల ఆర్థిక సాయం చేసిందన్నారు. రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించినందుకు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన అపాయింట్మెంట్ లెటర్ పంపిణీ కార్యక్రమానికి రింకూ హాజరుకాలేకపోయారు.
ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ప్రస్తుతం కేకేఆర్ జట్టుతో ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాడు. త్వరలోనే లక్నోకు వచ్చి సీఎంను కలుస్తానని, ఆయన ఆశీర్వాదం తీసుకోనున్నట్లు చెప్పారు. ఐపీఎల్ ఫ్రాంచైజీతో ఉన్న ఒప్పందం ప్రకారం సెర్మనీకి రింకూ రాలేకపోయినట్లు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్పీ సింగ్ తెలిపారు. లక్నోలో ఉన్న స్పోర్ట్స్ డైరెక్టరేట్ ఆఫీసులో రింకూ విధులు నిర్వహిస్తారన్నారు. అయితే టీమిండియాతో ఆడే షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని రింకూకు అడ్మినిస్ట్రేట్ విధులను అప్పగించనున్నట్లు చెప్పారు.
ఇటీవల టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రింకూ సింగ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలోనే ఆయన తండ్రి మరణించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఈ ఏడాది కేకేఆర్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా రింకూ నియమితుడయ్యాడు.
🎉 Big win for Rinku Singh!UP govt announces ₹3 crore reward & Sports Officer job for the cricketer. Missed the event, but sent a heartfelt video thanking CM Yogi Adityanath pic.twitter.com/3OwKSRaz3P
— indiainlast24hr (@indiain24hr) March 25, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

