KCR | కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలక పాల్పడుతున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక సీఎం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరతీశాడు. ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై హత్యాయత్నానికి ప్లాన్ చేయడం సంచలనంగా మారింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి కాంగ్రెస్ గుంపు బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి బయలుదేరిన వారిని పోలీసులు దగ్గరుండి సాగనంపుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
వ్యవసాయ క్షేత్రం మీదకు బయలుదేరిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే కేసీఆర్ చావాలి, ఆయన చావు కోరుకుంటున్నాం అంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడటంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 144 సెక్షన్ విధించామని, ఎవరూ రావద్దని చెబుతున్న పోలీసులు మరోవైపు కాంగ్రెస్ గుండాలను పంపడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
బ్రేకింగ్ న్యూస్
కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు గజ్వేల్ నుండి ఎర్రవెల్లి బయలుదేరిన కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి https://t.co/fkEcdWppmQ
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026