Karthi | తెలుగు సినిమాలు తమిళంలో ఆడట్లేదనడం కరెక్ట్ కాదు: హీరో కార్తీ
Telugu Movies | హైదరాబాద్‌లో జరిగిన 'సర్దార్ 2' ప్రమోషన్స్‌లో హీరో కార్తీ తెలుగు సినిమాలు మరియు ఇక్కడి ప్రేక్షకులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Telugu Movies | హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో హీరో కార్తీ తెలుగు సినిమాలు మరియు ఇక్కడి ప్రేక్షకులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమిళనాట తెలుగు సినిమాలకు ఆదరణ లేదనే వాదన సరికాదని, మంచి కంటెంట్ ఉన్న ఏ భాషా చిత్రాలనైనా కోలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని స్పష్టం చేశారు. బాహుబలి నుంచి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్, కాంతార వరకు ఏ భాష సినిమాను అయిన బాగుంటే చూస్తారని కార్తీ తెలిపాడు. ఇక పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ, త్వరలో దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో కలిసి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నట్లు కార్తీ అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, తన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనని తెలిపారు. ‘ఖైదీ’, ‘సర్దార్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ, ‘సర్దార్ 2’తో మరో భారీ విజయాన్ని అందుకుంటామనే పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

