Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రాష్ట్రంలోని రైతాంగానికి సకాలంలో నీళ్లందించకుండా పంటలను ఎండబెట్టి ఆంధ్రా ( Andhra ) కు నీళ్లందించిన పాపాత్ముడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని రైతాంగానికి సకాలంలో నీళ్లందించకుండా పంటలను ఎండబెట్టి ఆంధ్రా ( Andhra ) కు నీళ్లందించిన పాపాత్ముడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామం పాటిగడ్డ తండాలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు రాములు నాయక్ ఎండిన వరిపంటలను ఆయన పరిశీలించి రైతును ఓదార్చారు.

ఈ సందర్భంగా రైతుకు వ్యక్తిగతంగా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆయన మాట్లాడుతూ అడగకున్న అనేక సంక్షేమ పథకాలు అందించిన ఆత్మబంధువు కేసీఆర్( KCR ) అని కొనియాడారు. రైతులు అరచిగీపెట్టినా, హరిగోస పడుతున్నా కరెంటు ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా విమర్శించారు. నీటి లభ్యత ఉన్నా ఆంధ్రా ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి 110 టీఎంసీ నీళ్లు ఆంధ్రాకు దోచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాములు నాయక్ మాట్లాడుతూ తన పంట ఎండి బాధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకులు పరామర్శించిన పాపాన పోలేదని , నిరంజన్ రెడ్డి ధైర్యం నింపి రూ. 5వేలు ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య, జంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

