Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
Mamata Banerjee | బీజేపీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ సర్కారు (West Bengal Govt) పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తంచేశారు. కోల్‌కతా (Kolkata) లోని ఓ క్లబ్ ముందు ప్రధాన రహదారిపై ప్రభుత్వం పూజా కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు. రోడ్డుపై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ పనులు తాము చేసుకోనివ్వలేదని ఆరోపించారు. నడి రోడ్డుపై పూజా కార్యక్రమాలకు ప్రభుత్వం అక్రమంగా అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు.
Mamata Banerjee : బీజేపీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ సర్కారు (West Bengal Govt) పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తంచేశారు. కోల్‌కతా (Kolkata) లోని ఓ క్లబ్ ముందు ప్రధాన రహదారిపై ప్రభుత్వం పూజా కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు. రోడ్డుపై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ పనులు తాము చేసుకోనివ్వలేదని ఆరోపించారు. నడి రోడ్డుపై పూజా కార్యక్రమాలకు ప్రభుత్వం అక్రమంగా అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు.
గతంలో అక్కడ ఎప్పుడూ రోడ్డుపై పూజ జరగలేదని, పూజలు లోపల జరిగేవని గుర్తుచేశారు. శుక్రవారం రాత్రి వారు రహదారి మూల మలుపు వద్దే పూజ నిర్వహించారని, దాంతో తాము తమ సొంత పూజా కార్యక్రమానికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయిందని విమర్శించారు. ఇది పూర్తిగా అహంకారపూరితమైన, అణచివేత చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు బుల్డోజర్లను తీసుకురావాలనుకుంటున్నారా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే రండి, మా శరీరాల మీద నుంచే మీ బుల్డోజర్లను నడపండి అని ఆగ్రహంతో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

