Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రాష్ట్రంలోని రైతాంగానికి సకాలంలో నీళ్లందించకుండా పంటలను ఎండబెట్టి ఆంధ్రా ( Andhra ) కు నీళ్లందించిన పాపాత్ముడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని రైతాంగానికి సకాలంలో నీళ్లందించకుండా పంటలను ఎండబెట్టి ఆంధ్రా ( Andhra ) కు నీళ్లందించిన పాపాత్ముడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామం పాటిగడ్డ తండాలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు రాములు నాయక్ ఎండిన వరిపంటలను ఆయన పరిశీలించి రైతును ఓదార్చారు.

ఈ సందర్భంగా రైతుకు వ్యక్తిగతంగా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆయన మాట్లాడుతూ అడగకున్న అనేక సంక్షేమ పథకాలు అందించిన ఆత్మబంధువు కేసీఆర్( KCR ) అని కొనియాడారు. రైతులు అరచిగీపెట్టినా, హరిగోస పడుతున్నా కరెంటు ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా విమర్శించారు. నీటి లభ్యత ఉన్నా ఆంధ్రా ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి 110 టీఎంసీ నీళ్లు ఆంధ్రాకు దోచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాములు నాయక్ మాట్లాడుతూ తన పంట ఎండి బాధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకులు పరామర్శించిన పాపాన పోలేదని , నిరంజన్ రెడ్డి ధైర్యం నింపి రూ. 5వేలు ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య, జంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ.. అమన్‌తో శివ గొడవ.. హౌస్‌లో రచ్చ రచ్చ!
Deeksha Diwas | లక్ష మందితో ‘దీక్షా దివస్’ సభ.. 40 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు
Mani Kumar | మణికుమార్ మృతి.. కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
Smart Meters | స్మార్ట్‌గా విద్యుత్తు చోరీ.. స్మార్ట్ మీటర్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి మోసం!
TMREIS | ‘టెమ్రిస్’పై కాంగ్రెస్ సర్కార్ కత్తి.. యంగ్ ఇండియాలో మైనారిటీ గురుకులాల విలీనానికి నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

