IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
IL-76 Aircraft: ఐఎల్-76ఎండీ వ్యూహాత్మక రవాణా విమానం చరిత్ర సృష్టించింది. అత్యంత విజయవంతంగా న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆల్టిట్యూడ్‌లో న్యోమా రన్‌వే ఉన్నది.
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి చెందిన ఐఎల్-76ఎండీ వ్యూహాత్మక రవాణా విమానం(IL-76 Aircraft) చరిత్ర సృష్టించింది. అత్యంత విజయవంతంగా న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆల్టిట్యూడ్‌లో ఈ విమానం ల్యాండ్ కావడం కొత్త మొలురాయిగా నిలిచింది. ఐఎల్-76 విమానానికి చెందిన నైపుణ్యం, ప్రిసిషన్, సిబ్బంది ప్రదర్శించిన ప్రొఫెషనలిజం అమోఘమని ఐఏఎఫ్ తన స్టేట్మెంట్లో తెలిపింది. దక్షిణ లాడాఖ్లో.. వాస్తవాదీన రేఖకు 40 కిలోమీటర్ల దూరంలో న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌ను కొత్తగా నిర్మించారు. గత ఏడాదే దీని నిర్మాణం పూర్తి అయ్యింది. గతంలో ఈ ప్రాంతానికి ఏఎన్-32, హెలికాప్టర్ల ద్వారా రవాణా సాగించేవారు. ఇప్పుడు ఫైటర్ విమానాలను కూడా ఆపరేట్ చేసే స్థాయిలో న్యోమా ఎయిర్‌ఫీల్డ్ తయారైనట్లు ఐఏఎఫ్ తన ప్రకటనలో తెలిపింది.
భారతీయ వ్యూహాత్మక వైమానిక సామర్థ్యంలో కొత్త మైలురాయి లిఖించినట్లు అవుతుందని ఐఏఎఫ్ చెప్పింది. 1980 మధ్య దశకంలో ఐఎల్-76 రవాణా విమానాలు భారతీయ వైమానిక దళంలో చేరాయి. హెవీ లిఫ్టింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాయి. ఈ విమానాలు 45 టన్నుల బరువును మోయగలవు. లడాఖ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు యుద్ధ ట్యాంకులు, యుద్ద వాహనాలు, అతిభారీ ఎక్విప్మెంట్ను ఈ విమానం తరలించగలదు. లేహ్‌తో పాటు తోసి ప్రాంతాలకు లాజిస్టిక్ మిషన్‌లో భాగంగా ఐఎల్-76 విమానాలు వెళ్తుంటాయి.
న్యోమా ఎయిర్‌ఫీల్డ్ సముద్ర మట్టానికి సుమారు 10 వేల ఫీట్ల ఎత్తులో ఉన్నది. సియాచిన్‌లో ఆపరేషన్స్ చేపట్టేందుకు ఈ ఎయిర్‌ఫీల్డ్ కీలకంకానున్నది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ప్రాజెక్టు హిమాంక్‌లో భాగంగా 3 కిలోమీటర్ల పొడువైన కాంక్రీట్ రన్‌వేను న్యోమాలో నిర్మించారు.అయితే ఇక్కడ ఉన్న అతిశీతల వాతావరణాన్ని తట్టుకునే రీతిలో దీన్ని నిర్మించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

