జోగులాంబ గద్వాల : ప్రధానమంత్రి సహాయనిధికి (PM Relief Fund) విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీకాంతరెడ్డి ( Laxmikantha Reddy ) సామాజిక బాధ్యతగా విరాళం అందజేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు సోమవారం గద్వాల ఐడీఓసీ సమావేశ మందిరంలో వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె గ్రామానికి చెందిన రైతు,విశ్రాంత ఉపాధ్యాయుడు గోరంట్ల లక్ష్మీకాంతరెడ్డి రూ.లక్ష విరాళంగా డిమాండ్ డ్రాఫ్ట్‌ను అదనపు కలెక్టర్ కు అందజేశారు.
లక్ష్మీకాంత రెడ్డి ఇది వరకు కూడా తనకు రైతు భరోసా ద్వారా వచ్చిన డబ్బులను పలుమార్లు సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు నెలలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నందున తన వంతుగా సహకారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.