వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో (Ajilapur school ) ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులను (Teachers) నియమించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం నాగర్‌కర్నూల్‌లో జిల్లా విద్యాధికారి రమేష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
అజిలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది నుంచి 8వ తరగతి కి అప్‌గ్రేడ్ జరిగిందని, దీంతో విద్యాబోధన కోసం తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, హిందీ సబ్జెక్టులకు టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడించారు.
వెంటనే నలుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కేశమౌని పద్మ, గ్రామస్తులు సిద్ధగోని రమేష్ గౌడ్, కేశమౌని కృష్ణయ్య గౌడ్, కొప్పు కృష్ణయ్య, కుర్పూర్ కుమార్, కొప్పుల రామస్వామి, కొప్పుల యాదయ్య,వెంకటయ్య జంగయ్య తదితరులు ఉన్నారు.