దామరగిద్ద : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో( EGS ) పని చేస్తున్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు (Pending Wages) చెల్లించాలని దామరగిద్ద ఎంపీడీవోకు ( MPDO ) వినతిపత్రం అందజేశారు. ఏపీవోలు , టెక్నికల్ అసిస్టెంట్లు , కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్లకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల సిబ్బంది అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఏపీవో జయమ్మ, టీఏఎస్ రవికుమార్ తెలిపారు.
అధికారులు స్పందించకపోతే రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకారం శుక్రవారం నుంచి నిరసనలకు వెళ్తామని ఉపాధి సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నయీం, నరేష్, స్వామి, సీవోలు మహేశ్వరి, ఇందిరా, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.