మర్పల్లి, నవంబర్16: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీడీవో వెంకటరాములు పేర్కొన్నారు. మంగళవారం చైల్డ్‌లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బాల లు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని విద్యాభ్యాసం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటశ్రీను, సీడబ్ల్యుసీ చైర్మన్ వెంక టేశ్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి పాఠశాల ఎస్వో శైలజ, చైల్డ్ లైన్ సిబ్బంది యాదయ్య, రామేశ్వర్ పాల్గొన్నారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, నవంబర్ 16: మం డల పరిధిలోని గోపాల్పూర్ అంగన్వాడీ కేంద్రంలో బా ల ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.అనంతరం బా లల దినోత్సవ విశిష్టత గు రిం చి అంగన్వాడీ టీచర్ లలిత చెప్పారు.కార్యక్రమంలో చిన్నా రులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దోమ మండల పరిధిలో
దోమ, నవంబర్16: దోమ మండల పరిధిలోని దోర్నాల్‌పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని పుర స్కరించుకొని అంగన్వాడీ టీచర్ కవిత చిన్నారులకు ఆ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.కార్య క్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలను పనిలో పెట్టుకోవద్దు
కులకచర్ల, నవంబర్ 16 : బాలలహక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కులకచర్ల ఎంఈవో అబీబ్హైమద్, సర్పంచ్ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో బాలలహక్కుల దినోత్సవాన్ని నిర్వ హించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్ల లను పనుల్లో పెట్టుకోరాదని, వారిపై పనిభారాన్ని వేయ రాదని తెలిపారు. బాలలను చదువులో ప్రోత్సహించాల న్నారు. కార్యక్రమంలో కులకచర్ల ఎస్ఐ శ్రీనివాస్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట య్య, కేజీబీవీ ఎస్వో దేవి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, షఫీ, అశోక్, సరిత, భాగ్యలక్ష్మి, చైల్డ్‌లైన్ సిబ్బంది రాం చం ద్రయ్య, రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.