కాశీబుగ్గ, మార్చి 3: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.32 వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కెపల్లికి చెందిన రైతు భిక్షపతి దేశీరకం మిర్చి 10 బస్తాలు మార్కెట్‌కు తీసుకురాగా.. వ్యాపారి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 32 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కార్యదర్శి వెంకటేశ్ రాహుల్ రైతు భిక్షపతిని శాలువాతో సత్కరించారు.