జైపూర్ : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం నుంచి మొట్టమొదటి సారిగా రైలుమార్గం వ్యాగన్ల ద్వారా యాష్ బయటకు తరలించి అధికారులు మరో రికార్డు సృష్టించినట్లు జీఎం శాస్త్రి శనివారం తెలిపారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఈఅండ్ఎం సత్యనారాయణరావు సూచనలతో యాష్ సరఫరా వ్యాగన్ల ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌రన్‌లో 10,054 టన్నులు తరలించి రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం జూన్ 23వ తేదీన 6713 టన్నుల యాష్‌ను వివిధ అవసరాలకు తరలించగా శుక్రవారం రైలుమార్గం ద్వారా గతంలో కన్న రెట్టింపు యాష్‌ను 10, 054 టన్నులు సీహెచ్‌పీకి తరలించినట్లు వెల్లడించారు. ఎస్టీపీపీ ప్రారంభం నుంచి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో తరలించడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఉద్యోగిని సీఎండీ శ్రీధర్, ఈఅండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణ అభినందించారు.