Realme 16 Pro : రియల్మీ సంస్థ నుంచి 16 సిరీస్ ఫోన్లు మంగళవారం భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. రియల్మీ 16 ప్రో, రియల్మీ 16 ప్రో + అనే రెండు 5జీ ఫోన్లను సంస్థ విడుదల చేసింది. వీటి ఫీచర్ల వివరాలు..
రియల్మీ 16 ప్రో
ఈ 5జీ ఫోన్ 6.78 అంగుళాల డిస్ ప్లే, 1,400 నిట్స్ బ్రైట్ నెస్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ రియల్మీ యూఐ 7.0, 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 మ్యాక్స్ 5జీ చిప్ సెట్, ఐపీ 66+ఐపీ 68+ఐపీ69+ఐపీ 69 కే రేటింగ్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ డ్యూయల్ మెయిన్ కెమెరాతోపాటు, 50ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ +12జీబీ, 8జీబీ +256 జీబీ, 12జీబీ+256 జీబీ అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. దీని ధరలు సుమారు రూ.31,999, రూ.33,999, రూ.36,999గా ఉన్నాయి.
రియల్మీ 16 ప్రో
ఇది ఈ సిరీస్ లో హై ఎండ్ మోడల్. 6.8 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 144హెర్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 7, 4వ జనరేషన్ ప్రాసెసర్, వెనుకవైపు 200ఎంపీ వైడ్ యాంగిల్, 50ఎంపీ టెలిఫోటో, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌లతో ట్రిపుల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లున్నాయి. 8జీబీ+128 జీబీ, 8జీబీ+256 జీబీ వేరియెంట్లలో లభిస్తుంది. దీని ధరలు సుమారు రూ.41,999, 44,999గా ఉన్నాయి. కొన్ని కార్డులపై రెండు రకాల ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.