realme 15T | మొబైల్స్ తయారీ సంస్థ రియల్ మి మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్‌మి 15టి పేరిట ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.57 ఇంచుల 4ఆర్ కమ్ఫర్ట్ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్బుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా ఈ ఫోన్‌కు 4000 నిట్స్ బ్రైట్నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జి చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ చాలా అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది.
ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్ కు గురి కాదు. ఇందులో ఐపీ66, 68, 69 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. 3 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌ను కేవలం 7.79 ఎంఎం మందంతో అత్యంత పలుచగా తయారు చేశారు. కేవలం 181 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను సూట్ టైటానియం, సిల్క్ బ్లూ, ఫ్లోయింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలకు గాను పలు ఏఐ ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ఏఐ ఎడిట్ జీనీ, ఏఐ స్నాప్ మోడ్, ఏఐ ల్యాండ్ స్కేప్, ఏఐ ఎరేజర్, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ వంటి ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ఫొటోలు, వీడియోలను అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా అమర్చారు. దీనికి 60 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 31 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. అలాగే 10 వాట్ల రివర్స్ చార్జింగ్కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. కనుక ఈ ఫోన్ సహాయంతో ఇతర ఫోన్లకు సైతం చార్జింగ్ పెట్టుకోవచ్చు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు.
ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. రియల్‌మి 15టి ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999 ఉండగా దీనిపై క్రెడిట్ కార్డు ఈఎంఐతో రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 10 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌కు గాను ప్రీ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైస్ స్టోర్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.