న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. కొన్ని మార్పులతో ఎస్ఆర్హెచ్ సరికొత్తగా జెర్సీని రూపొందించింది. ‘సరికొత్త ఆరెంజ్ ఆర్మర్.. రెడీ టు రైజ్’ అంటూ సోషల్ మీడియాలో జెర్సీ ఫొటోలను బుధవారం పంచుకుంది. రిటెన్షన్‌లో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు) అట్టి పెట్టుకుంది. రెండు రోజుల్లో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలానికి యాజమాన్యం ప్రణాళికలు రచిస్తున్నది.