MI vs RCB : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఆర్సీబీ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతోంది. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రజత్ పాటిదార్ బౌలింగ్ తీసుకున్నాడు. నాలుగో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు గెలిస్తే.. ముంబై ఇంటికి వెళ్లడం ఖాయం.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై మధ్య కాసేపట్లో బిగ్ మ్యాచ్ జరుగనుంది. ఇరుజట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్ కావడంతో విజయం కోసం హోరాహోరీ తప్పదు. ముంబై సారథి హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ టాస్కు వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసేందుకు తాము ఆతమ విశ్వాసంతో ఉన్నామని చెప్పాడు సూర్య.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేశ్ యాదవ్, స్నప్నిల్ సింగ్, వెంకటేశ్ అయ్యర్.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవ, కార్బన్ బాస్చ్, దీపక్ చాహర్, బుమ్రా, గజన్ఫర్.
ఇంప్యాక్ట్ సబ్స్ – రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్ధూల్ ఠాకూర్, బౌల్ట్.