Farmer | రైతు వెన్ను విరిచిన రేవంత్ సర్కారు.. కొనుగోలు కేంద్రంలో రైతన్న కన్నీటి గోస వీడియో
Farmer | ‘దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి.. అదే రైతు వెన్ను విరుస్తున్నారు’ అంటూ ఒక సామాన్య రైతు ఆవేదనతో కూడిన ప్రసంగం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. బోర్డులకే పరిమితమైన మద్దతు ధర.. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
Farmer | జూలూరుపాడు, మే 10 : ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని చాటి చెబుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి.. అదే రైతు వెన్ను విరుస్తున్నారు’ అంటూ ఒక సామాన్య రైతు ఆవేదనతో కూడిన ప్రసంగం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. బోర్డులకే పరిమితమైన మద్దతు ధర.. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వం గ్రేడ్-ఏ రకానికి రూ.2389 ధర నిర్ణయించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, కొనుగోలు చేసే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. సీసీఐ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై సామాన్య రైతును నిలువునా ముంచుతున్నారని ఈ వీడియోలో రైతు కళ్ళకు కట్టినట్లు వివరించారు.
క్వింటాల్‌కు 10 కేజీల కోత.. 25 రోజులుగా ధాన్యం కుప్పల దగ్గరే కాపలా ఉంటున్నాం. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తీరా కొంటామన్న వారు క్వింటాల్‌కు 10 కేజీల తరుగు (తారం) తీస్తామంటున్నారు.ఇది రైతును దోచుకోవడం కాదా..? అని ఆ రైతు ప్రశ్నించారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు సాగకపోవడంతో, విధి లేక రైతులు బయట దళారులకు కేవలం రూ.1300 కే క్వింటాల్ ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు. అంటే కష్టపడి పండించిన పంటకు సగం ధర కూడా రావడం లేదని, ఈ నష్టానికి బాధ్యులెవరని ఆయన నిలదీశారు. రైతుల తలరాత మారదా..? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిందని, కానీ ఇప్పుడు అసలు మద్దతు ధరకే దిక్కులేకుండా పోయిందని రైతు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రాజ్యం అని ప్రచారం చేసుకుంటుండగా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వైరల్ అవుతున్న రైతన్న ఆవేదన.. స్పందించేదెవరు.. ?
ధాన్యం బస్తాల సాక్షిగా రైతు తన గోడును వెలిబుచ్చుతున్న ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
Read Also :
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

