RCB vs DC : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (35) ఔట్ అయింది. అలిసే క్యాప్సే ఓవర్లో శిఖా పాండ్ క్యాచ్ పట్టడంతో మంధాన ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, 56 వద్ద ఆ జట్టు రెండో వికెట్ పడింది. ప్రస్తుతం ఎలిసా పెర్రీ (15), దిశా కసాత్ (2) క్రీజులో ఉన్నారు. 41 పరుగుల వద్ద మరో ఓపెనర్ సోఫీ డెవిన్ (14) ఔట్ అయింది. 8 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 66/2 తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు.