Dhamaka Movie First Single Released | ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెండు వరుసగా ఫ్లాప్‌లు అవడంతో మాస్రాజ అభిమానులను తీవ్రంగా నిరాశచెందారు. ఈ రెండు సినిమాల ఫలితాలు రవితేజను కూడా పూర్తిగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి శ్రద్ధను పెట్టాడు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘ధమాకా’ ఒకటి. ‘నేనులోకల్’ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ జింతాక్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘జింతాక్’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో రవితేజ ఎనర్జీ వేరేలెవల్లో ఉంది. శ్రీలీల మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంది. ఈ పాటను కాసర్లశ్యామ్ రచించగా భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఆలపించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.