
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎన్నుకొన్నారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా ఎం రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా హరీశ్కుమార్రెడ్డి ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేశ్‌కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్‌గా జాకబ్, ముఖ్య సలహాదారుగా పవన్‌కుమార్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పద్మాగౌడ్, ఉపాధ్యక్షురాలిగా నిర్మలను ఎన్నుకొన్నారు.