Rashmika – Vijay | టాలీవుడ్లో ఎన్నో రోజుల నుండి హాట్ టాపిక్‌గా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తెరపై కెమిస్ట్రీతో మొదలైన ఈ కథ, ఆఫ్ స్క్రీన్‌లోనూ కొనసాగుతోందన్న ప్రచారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. 2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాతో తొలిసారి కలిసి నటించిన విజయ్–రష్మిక జంట, అప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్‌లో వారి సహజ నటన, రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఆ తర్వాత 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ ఈ జంటకు మరింత దగ్గర తీసుకొచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాతే వీరి మధ్య స్నేహం కాస్త ప్రత్యేక బంధంగా మారిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
కాలక్రమేణా వీరిద్దరూ విడివిడిగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసినా, వాటి బ్యాక్‌డ్రాప్ ఒకటే కావడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. “వేరువేరుగా కనిపించినా ఒకే చోటే ఉన్నారు” అంటూ ఫ్యాన్స్ అప్పుడే గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. విదేశీ వెకేషన్లు, హాలిడే ట్రిప్స్, ఒకే టైమ్‌లో వచ్చే పోస్టులు… ఇవన్నీ ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక, విజయ్ ఇద్దరూ రోమ్కు వెళ్లిన విషయం మరింత చర్చకు దారి తీసింది. రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కనిపించడంతో, ఇది ఫ్రెండ్స్ ట్రిప్ కాదని, ఫ్యామిలీ వెకేషన్ అన్న అభిప్రాయం బలపడింది. అలాగే విజయ్ పంచుకున్న కొన్ని ఫోటోల్లో రష్మిక అతడిని వెనక నుంచి హత్తుకున్నట్టుగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట, తాజాగా వెకేషన్ ముగించుకుని కలిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వీడియోలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. “ఇంతకాలం రహస్యంగా ఉంచిన బంధం ఇప్పుడు కళ్ల ముందే కనిపించింది” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఫిబ్రవరిలో పెళ్లి అంటూ వార్తలు రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే దీనిపై స్పందించిన రష్మిక, “సమయం వచ్చినప్పుడు మేమే చెప్పుకుంటాం” అంటూ స్పష్టత ఇచ్చారు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటపై రూమర్లు ఎన్ని వచ్చినా, వారు మాత్రం తమదైన మౌనంతోనే ముందుకు సాగుతున్నారు. తెరపై మొదలైన ఈ ప్రయాణం నిజ జీవితంలో ఎక్కడికి చేరుతుందో చూడాలి.